Train Accident: ఒడిశా రైలు ప్రమాదం: సహాయక చర్యల్లో వందలాది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, అంబులెన్స్‌లు

  • త్వరితగతిన స్పందించిన ఎన్డీఆర్ఎఫ్, మెడికల్ టీమ్స్, అంబులెన్స్ విభాగాలు
  • క్షతగాత్రులను వేగంగా ఆసుపత్రులకు తరలించిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది
  • శనివారం మధ్యాహ్నం నాటికి దాదాపు పూర్తైన సహాయక చర్యలు
Odisha Train Accident More Than 300 Rescuers Are Working for Odisha train accident says NDRF Director General

ఒడిశాలోని బాలేశ్వర్ లో జరిగిన ఘోర ట్రిపుల్ ట్రైన్ యాక్సిడెంట్ లో దాదాపు 300 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశ రైల్వే చరిత్రలోనే అత్యంత విషాధ సంఘటనల్లో ఇది ఒకటిగా నిలిచింది. శుక్రవారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం విషయం తెలియగానే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు మెడికల్ టీమ్స్, అంబులెన్స్ వంటి విభాగాలు వెంటనే స్పందించాయి. ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ కూడా రంగంలోకి దిగాయి. క్షతగాత్రులను వేగంగా ఆసుపత్రులకు తీసుకువెళ్లాయి. శుక్రవారం రాత్రి ప్రారంభమైన సహాయక చర్యలు శనివారం మధ్యాహ్నం నాటికి దాదాపు పూర్తయ్యాయి.

ప్రమాదం విషయం తెలియగానే రాత్రి ఎనిమిదిన్నర గంటల సమయానికి బాలేశ్వర్ లోని తొలి ఎన్డీఆర్ఎఫ్ బృందం సంఘటన స్థలానికి చేరుకుంది. ఆ తర్వాత కటక్, కోల్‌కతాల నుండి మరిన్ని బృందాలు వచ్చాయి. మొత్తం 300 మందికి పైగా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, ఎస్టీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. వీరు తొమ్మిది బృందాలుగా ఏర్పడి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఎన్డీఆర్ఎఫ్ జాగిలాలు, మహిళా సిబ్బంది, వైద్య బృందాలు పాల్గొన్నాయి.

భారీ క్రేన్లు, గ్యాస్, ప్లాస్మా కట్టింగ్ యంత్రాలతో రైల్వే కోచ్ లను విడదీస్తూ అందులో ఇరుక్కుపోయిన వారిని కాపాడారు. లిఫ్టింగ్ ప్యాడ్స్ తో వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. కోచ్ లలో ఇరుక్కుపోయిన వందలాది మందిని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కాపాడింది. ప్రమాదం తీవ్రమైనది కావడంతో 200 అంబులెన్స్ లు, 50 బస్సులు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. 45 మొబైల్ ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేశారు. దాదాపు 1200 మంది రెస్క్యూ సిబ్బంది సాయంతో గాయపడిన వారిని వివిధ ఆసుపత్రులకు తరలించారు. కటక్ నుండి 25 మెడికల్ బృందాలతో పాటు మరో 50 మంది వైద్యులు వచ్చారు.

More Telugu News