ఓలా ఎస్1 ప్రో సముద్రంలో నడిపితే ఎలా ఉంటుంది? ఓ యూట్యూబర్ సాహసం
- సముద్ర తీరంలో నీటిలో ముంచి డ్రైవింగ్
- నిక్షేపంలా పనిచేసిన ఎలక్ట్రిక్ స్కూటర్
- వర్షానికి తడిసినా ఏమీ కాదనే సందేశం
యూట్యూబర్ ఓలా ఎస్1 ప్రో స్కూటర్ ను సముద్ర తీరంలోకి తీసుకెళ్లాడు. నీటిలో సీటు మునిగే దాకా వెళ్లి డ్రైవ్ చేశాడు. అతడు, బైక్ రెండూ సురక్షితంగానే ఉన్నాయి. నిజానికి సముద్రం నీరు అంటే ఉప్పుతో కూడుకుని ఉంటుంది. ఇది వాహనాన్ని డ్యామేజ్ చేయవచ్చు. కానీ, అతడికి ఇది మినహా మరో మార్గం కనిపించక అలా చేశాడు. నీటిలో మునిగినప్పటికీ ఎలా ఎస్1 ప్రో స్కూటర్ మోటారు పనిచేస్తూనే ఉంది. స్క్రీన్ కూడా ఆగిపోలేదు. సీటు కింద భాగంలోనే నీరు నిలిచింది. చార్జింగ్ సాకెట్ పూర్తిగా పొడిబారేలా జాగ్రత్త తీసుకున్నారు.