తెలుగు రాష్ట్రాల్లో రెండు సూపర్ ఫాస్ట్ రైల్వే లైన్లు... సర్వేకు రైల్వే బోర్డు అంగీకారం
- దేశంలో హైస్పీడ్ రైళ్ల వ్యవస్థ కోసం చర్యలు
- విశాఖ-విజయవాడ-శంషాబాద్... విశాఖ-విజయవాడ-కర్నూలు మార్గాల్లో లైన్లు
- ఆరు నెలల్లో సర్వే పూర్తి చేయాలని రైల్వే బోర్డు నిర్ణయం
రెండు మార్గాల్లో సూపర్ ఫాస్ట్ రైల్వే ప్రాజెక్టు ప్రవేశపెట్టేందుకు వీలుగా అవసరమైన టెక్నికల్ ఫీజబిలిటీనీ సర్వే ద్వారా నిర్ణయిస్తారు. ఈ రెండు రైల్వే లైన్ల నిడివి మొత్తం 942 కిలోమీటర్లు. ఈ మార్గాల్లో గంటకు 220 కిమీ గరిష్ఠ వేగంతో రైళ్లు ప్రయాణించేలా రైల్వే లైన్లు నిర్మించనున్నారు.
ఈ రెండు సూపర్ ఫాస్ట్ రైల్వే లైన్ల సాకారం కోసం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కొంతకాలంగా చొరవ చూపిస్తున్నారు. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ను కలిసి పలుమార్లు లేఖలు సమర్పించారు. ఈ నేపథ్యంలోనే కేంద్రం తాజా సర్వేకు పచ్చజెండా ఊపింది.