నెక్స్ట్ ఏం జరుగుతుందా అనే ఉత్కంఠ చివరివరకూ కూర్చోబెడుతుంది: బెల్లంకొండ గణేశ్
- బెల్లంకొండ గణేశ్ హీరోగా 'నేను స్టూడెంట్ సర్'
- రేపు రిలీజ్ అవుతున్న సినిమా
- కథానాయికగా అవంతిక పరిచయం
- హిట్ ఖాయమంటున్న హీరో
ఈ వేదికపై బెల్లంకొండ గణేశ్ మాట్లాడుతూ .. " ఇది చాలా మంచి సినిమా. దర్శక నిర్మాతల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ ఎంతో ప్యాషన్ తో ఈ సినిమాకి పనిచేయడం జరిగింది. ప్యాషన్ తో పనిచేసిన ప్రతి టీమ్ కి సక్సెస్ అనేది తప్పకుండా దొరుకుతుంది. అలాంటి సక్సెస్ ఈ సినిమాతో మాకు దొరుకుతుందని నేను భావిస్తున్నాను" అని అన్నాడు.
"ఇది థియేటర్ లో చూడవలసిన సినిమానే. నెక్స్ట్ ఏం జరుగుతుందా అనే ఒక క్యూరియాసిటీ మీకు సినిమా చివరివరకూ ఉంటుంది. థియేటర్ కి వెళ్లిన ప్రతి ఒక్కరూ ఈ సినిమాను ఎంజాయ్ చేస్తారు. తప్పకుండా ఈ సినిమా హిట్ కొడుతుందనే నమ్మకం ఉంది" అంటూ చెప్పాడు. ఈ సినిమాతో కథానాయికగా 'అవంతిక' పరిచయమవుతున్న సంగతి తెలిసిందే.