Singer: నన్ను గాయకుడి కంటే నటుడిగానే గుర్తిస్తారు: విజయ్ యేసుదాసు

  • సొంత బాటను నిర్మించుకోవడం కష్టమని పేర్కొన్న విజయ్  
  • మన సంగీతాన్ని ప్రజలకు చేరువ చేయడం కూడా కష్టమేనని వ్యాఖ్య 
  • నేడు టిక్ టాక్ మాదిరి ఎన్నో ప్లాట్ ఫామ్ లు ఉన్నట్టు వెల్లడి  
Singer Vijay Yesudas says creating own music is difficult task

ప్రముఖ గాయకుడు యేసుదాసు కుమారుడైన విజయ్ యేసుదాసు ఇండియాటుడే కాంక్లేవ్ సౌత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తన కెరీర్ పై మాట్లాడారు. నా కంటూ సొంత బాటను నిర్మించుకోవడం ఎంతో కష్టమైనది. సాధారణంగా ప్రజలు దీన్ని సులభమైనదిగా భావిస్తారు. విజయవంతమైన తల్లి లేదా తండ్రి పరిశ్రమలో ఉంటే మార్గం సులభమవుతుంది.. అంతే’’ అని విజయ్ యేసుదాసు చెప్పారు. 

తనను గాయకుడిగా కంటే కూడా నటుడిగానే ఎక్కువ మంది గుర్తిస్తారని పేర్కొన్నారు. ‘‘మీకంటూ సొంత సంగీతం సృష్టించుకోవడం కష్టమైన టాస్క్. మీ సంగీతానికి ప్రజలు చేరుకునేలా చేయడం కష్టం. నేడు టిక్ టాక్ మాదిరి ఎన్నో ప్లాట్ ఫామ్ లు అందుబాటులో ఉన్నాయి’’ అని విజయ్ తెలిపారు. 300కు పైగా సినిమా పాటలు పాడిన విజయ్ యేసుదాసు ఎన్నో తమిళ సినిమాల్లో నటుడిగా తన ప్రతిభను నిరూపించుకున్నారు. 

రెండు రోజల ఇండియాటుడే కాంక్లేవ్ సౌత్ కార్యక్రమం గురువారం కోవళంలో ప్రారంభమైంది. రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు దీనికి హాజరయ్యారు. వీరు తమ అభిప్రాయాలను ఇతరులతో పంచుకోనున్నారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, కమలహాసన్, రానా దగ్గుపాటి, శోభిత దూళిపాళ్ల తదితరులు పాల్గొన్నారు.

More Telugu News