పాము కాటు నుంచి త్రుటిలో తప్పించుకున్న బాలిక.. వీడియో ఇదిగో!
- ఇంటి గుమ్మం దగ్గర బుసలు కొడుతున్న పాము
- బయటి నుంచి వచ్చి ఇంట్లోకి వెళుతున్న బాలిక
- కర్ణాటకలోని బెళగావిలో ఘటన.. సీసీటీవీలో రికార్డు
బెళగావిలోని హలగా గ్రామంలో ఓ ఇంటి గుమ్మం ముందు పాము పాకుతూ వెళుతోంది. ఇది గమనించకుండా ఓ బాలిక మెట్ల పైనుంచి ఇంట్లోకి వెళుతోంది. గుమ్మం దగ్గరకు రాగానే పాము బెదిరిపోయి కాటేసేందుకు ప్రయత్నించింది. అయితే, బాలిక ముందుకు అడుగు వేయడంతో ముప్పు తప్పింది. ఈలోగా బాలిక లోపలికి వెళ్లకుండా గుమ్మం దగ్గరే ఆగడంతో పాము మరోమారు కాటేసేందుకు ప్రయత్నం చేసింది.
ఇంతలో ఇంట్లో ఉన్న పెద్దవాళ్లు పామును గమనించి హెచ్చరించడంతో బాలిక దూరం జరిగింది. ఆపై పాము వెనక్కి తిరిగి వెళ్లడంతో బాలిక ఇంట్లోకి పరుగు తీసింది. సీసీటీవీ కెమెరాలో రికార్డు అయిన ఈ దృశ్యాలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.