రోడ్డు నిర్మాణంలో ఇదో లీల.. కొత్తగా వేసిన రోడ్డును ఉత్తచేతులతో లేపిన గ్రామస్థులు.. వీడియో ఇదిగో!
- మహారాష్ట్రలోని జల్లా జిల్లాలో ఘటన
- రోడ్డును కార్పెట్లా లేపేసిన గ్రామస్థులు
- జర్మన్ టెక్నాలజీతో నిర్మించామన్న కాంట్రాక్టర్
వీడియో వైరల్ అయిన తర్వాత కాంట్రాక్టర్ స్పందించాడు. రోడ్డు నిర్మాణానికి జర్మన్ సాంకేతికతను ఉపయోగించినట్టు పేర్కొన్నాడు. రోడ్డును చేత్తో అమాంతం లేపేసిన గ్రామస్థులు ఈ నాసిరకం రోడ్డుకు అప్రూవల్ ఇచ్చిన ఇంజినీర్‌పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.