బహుశా అంత శిక్ష పడింది నాకొక్కడికే కావచ్చు.. రాహుల్ గాంధీ
- ఇలాంటివి జరుగుతాయని తాను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అనుకోలేదన్న రాహుల్
- తనపై అనర్హత వేటు కూడా మంచికే జరిగిందని వ్యాఖ్య
- దేశాన్ని ఇప్పుడు దేవుడి కంటే ఎక్కువ తెలిసిన వారు పాలిస్తున్నారని ఎద్దేవా
భారత్‌లో ప్రతిపక్షాలు పోరాడుతున్నాయని, వ్యవస్థలను బీజేపీ స్వాధీనం చేసుకుందని విమర్శించారు. తాము ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్నట్టు చెప్పారు. వ్యవస్థలేవీ సాయం చేయకపోవడాన్ని తాము చూశామని, అందుకనే తాము రోడ్లపైకి వస్తున్నామని, దాని ఫలితమే ‘భారత్ జోడో యాత్ర’ అని రాహుల్ వివరించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రజలతో మమేకం కావాలని, వారు అడిగే కొన్ని క్లిష్ట ప్రశ్నలకు సమాధానం చెప్పాలని రాహుల్ కోరారు. భారత్‌ను ఇప్పుడు దేవుడి కంటే తనకే ఎక్కువ తెలుసన్న వారు పాలిస్తున్నారని పరోక్షంగా మోదీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.