Tirupati: తిరుపతిలో రోడ్డు ప్రమాదం, ముగ్గురు తెలంగాణ వాసుల మృతి

Three persons including a child from Telangana die in road accident in tirupati
  • ఏర్పేడు మండలం మేర్లపాక చెరువు సమీపంలో ఘటన
  • ఆర్టీసీ బస్సు కారును ఢీకొనడంతో ప్రమాదం
  • ఘటనలో భార్య,భర్త, చిన్నారి మృతి, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
  • రూయా ఆసుపత్రిలో క్షతగాత్రులకు చికిత్స 
తిరుపతి జిల్లాలోని ఏర్పేడు మండలంలో బుధవారం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలంగాణ వాసులు మృత్యువాత పడ్డారు. మేర్లపాక చెరువు వద్ద ఓ ఆర్టీసీ బస్సు కారును ఢీకొట్టడంతో ఓ చిన్నారి, బిడ్డ తల్లిదండ్రులు దుర్మరణం చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులకు స్థానిక రూయా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. మృతులను తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లె వాసులుగా గుర్తించారు.
Tirupati

More Telugu News