MS Dhoni: కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స తీసుకోనున్న ధోనీ

Dhoni to take treatment for knee injury in Mumbai
  • మోకాలి గాయంతో బాధ పడుతున్న ధోనీ
  • గాయంతోనే ఈ ఐపీఎల్ ఆడిన వైనం
  • గాయం గురించి ఐపీఎల్ ప్రారంభంలోనే చెప్పిన ఫ్లెమింగ్
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ మోకాలి గాయంతో బాధపడుతున్నాడు. ఈ గాయంతోనే ఈ ఐపీఎల్ సీజన్ లో ఆడాడు. మరోవైపు ముంబై కోకిలాబెన్ ఆసుపత్రిలో మోకాలి గాయానికి ధోనీ చికిత్స తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. మరో వారం రోజుల్లో చికిత్స ప్రారంభం అవుతుందని చెపుతున్నారు. ఐపీఎల్ ప్రారంభం సమయంలోనే ధోనీ మోకాలి గాయం గురించి చెన్నై కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ మాట్లాడాడు. 

ధోనీ మోకాలి గాయంతో బాధపడుతున్నాడని... అతని కదలికల్లో దాన్ని మనం గుర్తించవచ్చని అన్నాడు. మరోవైపు ఐపీఎల్ లో చెన్నై జట్టు ఐదోసారి ట్రోఫీని గెలుచుకుంది. ఇంకోవైపు తన రిటైర్మెంట్ కు సంబంధించి ధోనీ మాట్లాడుతూ, ఆట నుంచి పూర్తిగా విశ్రాంతి తీసుకోవడానికి ఇదే సరైన సమయమని.... అయితే అభిమానుల కోసం మరో ఐపీఎల్ లో ఆడతానని చెప్పాడు.
MS Dhoni
Knee Injury

More Telugu News