మీడియా ప్రమేయం లేకుండా సీబీఐ విచారణ జరపాలి: సజ్జల
- జడ్జీలకు కూడా దురుద్దేశాలు ఆపాదిస్తున్నారన్న సజ్జల
- నిజాయతీపరులపై దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని విమర్శ
- సీబీఐ ఒక్క కోణంలోనే దర్యాప్తు జరుపుతోందని వ్యాఖ్య
జగన్ ఎంతో కష్టపడి నిర్మించుకున్న పార్టీ వైసీపీ అని... వైసీపీలో చేరతానని వివేకా అడిగితే జగన్ స్వాగతించారని సజ్జల తెలిపారు. పార్టీలో టికెట్లు ఎవరికి ఇవ్వాలనే విషయంలో జగన్ దే తుది నిర్ణయమని చెప్పారు. వివేకా హత్య కేసులో రాజకీయ కోణం ఎక్కడా లేదని అన్నారు. సీబీఐ ఒక్క కోణంలోనే దర్యాప్తు జరుపుతోందని... కుటుంబ వ్యవహారాలు, ఆస్తి అంశాల్లో దర్యాప్తు జరపడం లేదని తెలిపారు.