Airtel vs Jio: రోజూ 3జీ డేటా ఇచ్చే ప్రీ పెయిడ్ ప్లాన్లు

  • రూ.219 నుంచి ప్రారంభం
  • రూ.999 వరకు వివిధ రకాల ప్రీపెయిడ్ ప్లాన్లు
  • వీటిల్లో పలు రకాల సేవలు ఉచితం
Airtel vs Jio prepaid plans offering 3GB daily 5G data unlimited calling and other benefits compared

కొందరికి రోజువారీ డేటా ఎక్కువ అవసరం. అలాంటి వారి కోసమే ఎయిర్ టెల్, రిలయన్స్ జియో పలు ప్రీపెయిడ్ ప్లాన్లను అందిస్తున్నాయి. 

ఎయిర్ టెల్ రూ.399
ఈ ప్లాన్ లో రోజువారీ 3జీబీ హైస్పీడ్ డేటా తోపాటు, ఉచిత కాలింగ్, రోజువారీ 100 ఉచిత ఎస్ఎంఎస్ లు వస్తాయి. వ్యాలిడిటీ 28 రోజులు. అపోలో 24/7, ఎక్స్ ట్రీమ్ యాప్ సేవలు ఉచితం.

ఎయిర్ టెల్ రూ.499
పైన చెప్పుకున్న మాదిరే ప్రయోజనాలను ఈ ప్లాన్ కూడా ఆఫర్ చేస్తోంది. వ్యాలిడిటీ 28 రోజులు. కాకపోతే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మూడు నెలల చందా ఉచితంగా దీంతో లభిస్తుంది.

ఎయిర్ టెల్ రూ.699
ఈ ప్లాన్ కూడా రోజువారీ 3జీబీ హైస్పీడ్ డేటా, ఉచిత కాలింగ్, రోజూ 100 ఉచిత ఎస్ఎంఎస్ లు లభిస్తాయి. కాకపోతే ఈ ప్లాన్ వ్యాలిడిటీ 56 రోజులు. ఈ ప్లాన్లు అన్నింటిలోనూ 5జీ సేవలు ఉచితం.

జియో రూ.219
దీని వ్యాలిడిటీ కేవలం 14 రోజులు. రోజూ 3జీబీ డేటా లభిస్తుంది.  100 ఉచిత ఎస్ఎంఎస్ లు వాడుకోవచ్చు. అన్ని జియో యాప్ ల యాక్సెస్ ఉచితం. 

జియో రూ.399
ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు. ఇందులోనూ పైన చెప్పుకున్న అన్ని ప్రయోజనాలు వస్తాయి. 

జియో రూ.999
ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులు. పైన చెప్పుకున్నట్టే అన్ని ప్రయోజనాలకు అర్హులు.

More Telugu News