Aghora: స్నేహితుడి మృతదేహంపై కూర్చుని పూజలు చేసిన అఘోరా!

Aghora did pooja on friends body in Tamil Nadu Trichy
  • తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో ఘటన
  • భార్యతో గొడవల కారణంగా భర్త ఆత్మహత్య
  • విషయం తెలిసిన అఘోరా స్నేహితుడి రాక
  • వైరల్ అవుతున్న పూజల ఫొటోలు
భార్యతో గొడవల కారణంగా మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న స్నేహితుడి మృతదేహంపై కూర్చుని ఓ అఘోరా పూజలు చేశాడు. తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని సలూర్ సమీపంలోని కురుంబపాళెయానికి చెందిన మణికంఠన్ అంబులెన్స్ డ్రైవర్.

రెండేళ్ల క్రితం అతడికి వివాహం కాగా, భార్యతో మనస్పర్థల కారణంగా నిత్యం ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి. దీంతో మనస్తాపానికి గురైన మణికంఠన్ ఆదివారం విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తిరుచ్చికి చెందిన అతడి చిన్ననాటి స్నేహితుడికి విషయం తెలిసింది. 

అఘోరాగా ఉంటున్న అతడు వెంటనే మరికొందరితో కలిసి సలూర్ వచ్చి స్నేహితుడి మృతదేహంపై కూర్చుని పూజలు నిర్వహించాడు. అనంతరం జరిగిన అంత్యక్రియల్లోనూ పాల్గొన్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ కావడంతో ఈ ఘటన చర్చనీయాంశమైంది.
Aghora
Tamil Nadu
Trichy

More Telugu News