నేడు విశాఖలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నేడు విశాఖలో పర్యటించనున్నారు. సాయంత్రం 3 గంటలకు హైదరాబాద్ నుంచి విమానంలో విశాఖ బయల్దేరనున్నారు. సాయంత్రం 4 గంటలకు విశాఖ చేరుకుని అక్కడ్నించి రోడ్డు మార్గంలో అచ్యుతాపురం వెళతారు. ప్రగడ నాగేశ్వరరావు (యలమంచిలి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి) నివాసానికి చేరుకుని, కొత్త దంపతులు రాజు-భానులకు ఆశీస్సులు అందిస్తారు. ప్రగడ నాగేశ్వరరావు కుమారుడు రాజు వివాహం ఇటీవల జరిగింది. 

కాగా, సాయంత్రం 6.30 గంటలకు చంద్రబాబు విశాఖ పోర్టు స్టేడియానికి చేరుకోనున్నారు. అక్కడ విశాఖ (వెస్ట్) ఎమ్మెల్యే గణబాబు కుమారుడి పెళ్లికి హాజరవుతారు. వధూవరులను ఆశీర్వదించి, వుడా పార్కులో బి.వెంకటరమణ యాదవ్ కుమార్తె పెళ్లి రిసెప్షన్ కు హాజరవుతారు. 

ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం విజయవాడ బయల్దేరతారు. ఈ మేరకు చంద్రబాబు షెడ్యూల్ ఖరారైంది.


More Telugu News