శతకోటి వాగ్దానాలు ఇచ్చినా చంద్రబాబును ప్రజలు నమ్మరు: మంత్రి జోగి రమేశ్
- రాజమండ్రి మహానాడులో మేనిఫెస్టో ప్రకటించిన చంద్రబాబు
- రాజకీయాల్లో విశ్వసనీయత లేని వ్యక్తి చంద్రబాబు అన్న జోగి రమేశ్
- 650 హామీలు ఇచ్చి 10 కూడా అమలు చేయలేదని ఆరోపణ
మురికిపట్టిన చంద్రబాబును ప్రజలు ఎంతమాత్రం విశ్వసించరని, రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత లేని వ్యక్తి చంద్రబాబు అని జోగి రమేశ్ విమర్శించారు. 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు 650 హామీలు ఇచ్చారని, ఆ హామీల్లో పదింటిని కూడా అమలు చేయలేదని ఆరోపించారు. మహానాడులో చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టోను చింపి, పార్శిల్ చేస్తానని మంత్రి ప్రకటించారు. ఇక, ఈ నాలుగేళ్లలో సీఎం జగన్ పాలన అద్వితీయంగా సాగిందని కీర్తించారు.