ఇది ట్రైలర్ మాత్రమే.. అసలైన సినిమా ముందుంది: గంటా శ్రీనివాసరావు
- టీడీపీ మినీ మేనిఫెస్టో వైసీపీ నేతల గుండెల్లో గుబులు రేపుతోందన్న గంటా
- నాలుగేళ్లుగా జగన్ విధ్వంసక పాలన కొనసాగుతోందని విమర్శ
- నరకాసుర పాలనకు చరమగీతం పాడాలని వ్యాఖ్య
నాలుగేళ్లుగా జగన్ విధ్వంసకర పాలన కొనసాగుతోందని గంటా విమర్శించారు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంత మందికి అమ్మఒడి ఇస్తామన్న జగన్... ఆ తర్వాత ఒక్కరికే ఇస్తున్నారని అన్నారు. జగన్ పాలనలో ఏపీ అరాచకంలో ఆఫ్ఘనిస్థాన్ ను, అప్పుల్లో శ్రీలంకను దాటిపోయిందని చెప్పారు. మద్య నిషేధం విధిస్తామని చెప్పి మాట తప్పారని విమర్శించారు. కరెంట్ ఛార్జీలను 7 సార్లు పెంచారని అన్నారు. దేశంలో అత్యధిక పెట్రోల్, డీజిల్ ధరలు ఏపీలో ఉన్నాయని చెప్పారు. జగన్ కు సొంత తల్లి, చెల్లెలు కూడా దూరమయ్యారనే విషయాన్ని ప్రజలు తెలుసుకోవాలని అన్నారు. రాష్ట్రంలో నరకాసుర పాలనకు చరమగీతం పాడాలని చెప్పారు.