IPL: ఈ ఏడాది ఐపీఎల్ లో రికార్డులే రికార్డులు

  • అత్యధిక సెంచరీలు.. హయ్యెస్ట్ రన్ రేట్
  • హాఫ్ సెంచరీల్లోనూ రికార్డులే
  • 200 లకు పైగా స్కోరు చేసిన మ్యాచ్ లు కూడా ఎక్కువే
IPL 2023 season sees multiple records set and broken

ఫైనల్ మ్యాచ్ లో గెలిచి చెన్నై సూపర్ కింగ్స్ ట్రోపీ అందుకోవడంతో ఈ ఏడాది ఐపీఎల్ ముగిసింది. అయితే, ఈసారి రికార్డుల మీద రికార్డులు నమోదయ్యాయి. అత్యధిక సెంచరీలు, హైస్కోరు, ఫైనల్ బాల్ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లు.. ఇలా 2023 ఐపీఎల్ ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా జరిగింది. ఈ సీజన్ లో నమోదైన రికార్డులు ఏంటంటే..

  • ఈ సీజన్ లో అత్యధిక సెంచరీలు నమోదయ్యాయి. శుభ్ మన్ గిల్ సెంచరీతో మొదలుపెట్టి వరుసగా మూడు మ్యాచుల్లో సెంచరీ బాదేశాడు. ఐపీఎల్ లో ఒక బ్యాట్స్ మన్ ఇలా వరుసగా మూడు మ్యాచుల్లో మూడు సెంచరీలు చేయడం ఇదే ప్రథమం.
  • సీజన్ మొత్తంలో మొత్తంగా 12 సెంచరీలు నమోదయ్యాయి. 
  • సీజన్ల వారీగా 2023లో 12, 2022లో 8, 2016లో 7 సెంచరీలు నమోదయ్యాయి.
  • ఐపీఎల్ చరిత్రలోనే 7 సెంచరీలు చేసిన బ్యాట్స్ మెన్ గా కోహ్లీ రికార్డు సృష్టించాడు.
  • జట్టు టోటల్ స్కోరు 200లకు పైగా నమోదైన మ్యాచ్ లు.. 2023లో 37, 2022లో 18, 2018లో 15 మ్యాచ్ లు
  • 200లకు పైగా స్కోర్ ను విజయవంతంగా ఛేజ్ చేసిన మ్యాచ్ లు.. 2023లో 8, 2014లో 3, 2010,2018, 2022 మూడు సీజన్లలో 2 మ్యాచ్ లు
  • ఫస్ట్ ఇన్నింగ్స్ లో అత్యధిక యావరేజ్ స్కోరు.. 2023 లో 183 పరుగులు, 2018లో 172 పరుగులు, 2022లో 171 పరుగులు
  • అత్యధిక రన్ రేట్.. 2023లో ఓవర్ కు 8.99 పరుగులు, 2018లో 8.65 పరుగులు, 2022లో 8.54 పరుగులు
  • అత్యధిక హాఫ్ సెంచరీలు.. 2023 సీజన్ లో 153 హాఫ్ సెంచరీలు నమోదు కాగా, 2022లో 118, 2016లో 117 నమోదయ్యాయి

More Telugu News