Chiranjeevi: ఆయనతో అనుబంధం నాకెప్పుడూ చిరస్మరణీయం: చిరంజీవి

Chiranjeevi rememberes late NTR on his centenary
  • ఈ రోజు దివంగత ఎన్టీఆర్ శత జయంతి
  • నట సార్వభౌముడిని స్మరించుకున్న మెగాస్టార్
  • ఎన్టీఆర్ కలకాలం మన మనస్సుల్లో మిగిలిపోతారన్న చిరంజీవి
నట సార్వభౌముడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి, దివంగత ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఆయనను స్మరించుకున్నారు. ఎన్టీఆర్ కలకాలం మన మనస్సుల్లో మిగిలిపోతారని అన్నారు. ఆయనతో అనుబంధం తనకెప్పుడూ చిరస్మరణీయం అన్నారు. 

‘నూటికో కోటికో ఒక్కరు... వందేళ్లు కాదు... చిరకాలం, కలకాలం మన మనస్సులో మిగిలిపోతారు. చరిత్ర వారి గురించి భావితరాలకి గర్వంగా చెబుతుంది. అలాంటి కారణ జన్ముడు శ్రీ ఎన్టీఆర్. తెలుగు జాతి ఘనకీర్తికి వన్నె తెచ్చిన శ్రీ నందమూరి తారక రామారావు గారితో నా అనుబంధం నాకెప్పుడూ చిరస్మరణీయం’ అని చిరంజీవి ట్వీట్ చేశారు.
Chiranjeevi
ntr
Tollywood
centenary

More Telugu News