Punjab: తెలియకుండానే చిన్నారికి జన్మనిచ్చిన 12 ఏళ్ల బాలిక!

12 year old girl gives birth to baby at Guru Nanak Hospital

  • పంజాబ్‌లోని అమృత్‌సర్‌ జిల్లాలో ఘటన
  • కడుపునొప్పితో బాధపడుతూ ఆసుపత్రికి వెళ్లిన బాలిక
  • పరీక్షలు చేసి గర్భవతి అని నిర్ధారించిన వైద్యులు
  • ప్రసవం చేసి 800 గ్రాముల చిన్నారిని బయటకు తీసిన వైనం
  • విషమంగా తల్లీ బిడ్డల ఆరోగ్యం

పన్నెండేళ్ల బాలిక తనకు తెలియకుండానే ఓ చిన్నారికి జన్మనిచ్చింది. పంజాబ్‌లోని అమృత్‌సర్ జిల్లా ఫగ్వార్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ ఘటన. కడుపు నొప్పితో బాధపడుతున్న బాలికను తండ్రి గురునానక్‌దేవ్ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమె గర్భవతి అని తేల్చారు. అనంతరం ప్రసవం చేసి 800 గ్రాముల బరువున్న పాపను బయటకు తీశారు. ఇద్దరి పరిస్థితి విషమంగానే ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. 

బాధిత బాలిక తండ్రి మాట్లాడుతూ.. ఏడు నెలలుగా తన కుమార్తె కడుపునొప్పితో బాధపడుతోందని, నొప్పి అన్నప్పుడల్లా మందులు తెచ్చి వేస్తున్నానని తెలిపాడు. ఆసుపత్రికి వచ్చేంత వరకు కుమార్తె గర్భవతి అన్న విషయం తనకు తెలియదని వాపోయాడు. భార్య తనను విడిచి వెళ్లిపోయిందని, ఇంట్లో తామిద్దరమే ఉంటామని వివరించాడు. దీంతో బాలికను ప్రశ్నించగా ఏడు నెలల క్రితం బహిర్భూమికి వెళ్లిన సమయంలో తనపై అత్యాచారం జరిగిందని తెలిపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని తెలిపారు.

Punjab
Amritsar
Guru Nanak Hospital
  • Loading...

More Telugu News