New Parliament: స్వాతంత్ర్యం సిద్ధించాక పార్లమెంటులో తొలి అడుగు పెట్టిన రావి నారాయణరెడ్డి మనోడే!

  • 1951-52లో దేశంలో తొలి సార్వత్రిక ఎన్నికలు
  • నల్గొండ నుంచి పీడీఎఫ్ అభ్యర్థిగా బరిలోకి దిగిన రావి నారాయణరెడ్డి
  • కాంగ్రెస్ అభ్యర్థి వి.భాస్కరరావుపై 2 లక్షల పైచిలుకు ఓట్లతో ఘన విజయం
  • నెహ్రూ చొరవతో పార్లమెంటులో తొలి అడుగు వేసిన రావి
Ravi Narayana Reddy Who Put First Feet In Old Parliament Is From Telangna

భారత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం సందర్భంగా పాత పార్లమెంటుకు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత 1951-52లో తొలి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. నెహ్రూ సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. 

తెలంగాణ సాయుధ పోరాటంలో చురుగ్గా పాల్గొన్న రావి నారాయణరెడ్డి ఆ ఎన్నికల్లో నల్గొండ నుంచి పీడీఎఫ్ అభ్యర్థిగా లోక్‌సభకు పోటీ చేసి  కాంగ్రెస్ అభ్యర్థి వి. భాస్కరరావుపై 2,22,280 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. రావి నారాయణరెడ్డి స్వస్థలం ప్రస్తుత యాదాద్రి-భువనగిరి జిల్లా భువనగిరి మండలంలోని బొల్లేపల్లి గ్రామం.

ఆ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్ (పూర్‌పూర్) నుంచి పోటీ చేసిన నెహ్రూ.. కేఎంపీపీ అభ్యర్థి బన్సీలాల్‌పై 1,73,929 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. దీంతో నెహ్రూ చొరవతో రావి నారాయణరెడ్డి పార్లమెంటులో తొలి అడుగుపెట్టి ఆ ఘనత సాధించిన తెలుగు వ్యక్తిగా రికార్డులకెక్కారు.

More Telugu News