మహానాడులో లోకేశ్ ఎంట్రీ.. కార్యకర్తల్లో జోష్!
- మహానాడులో నారా లోకేశ్ ఎంట్రీతో కార్యకర్తల్లో నూతనోత్సాహం
- నినాదాలతో ప్రాంగణాన్ని హోరెత్తించిన అభిమానులు
- యువనేతతో ఉత్సాహంగా సెల్ఫీలు దిగిన వైనం
- అందరినీ అప్యాయంగా పలకరించిన లోకేశ్
‘జనహృదయమైన నారా లోకేశ్’ అంటూ యువగళం పాదయాత్రపై కేశినేని చిన్ని ముద్రించిన పుస్తకం కార్యకర్తల్లో ఆసక్తి రేకెత్తించింది. లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర తమలో కొత్త ఉత్సాహాన్ని నింపిందని అభిమానులు, కార్యకర్తలు లోకేశ్‌కు తెలిపారు. ఈ కార్యక్రమంలో లోకేశ్ గుంటూరు జిల్లా ప్రతినిధుల రిజిస్టర్‌లో నమోదు చేసుకున్నారు.