టెక్కలి అభ్యర్థిని ప్రకటించిన వైసీపీ
- ఇటీవల దువ్వాడ శ్రీనివాస్‌ను అభ్యర్థిగా ప్రకటించిన జగన్
- భార్య వాణితో కలిసి జగన్‌ను కలిసిన శ్రీనివాస్
- తనకే టికెట్ ఇవ్వాలని కోరిన వాణి
- నిన్న అధికారికంగా ఆమె పేరు ప్రకటన
టెక్కలి టికెట్‌ను తనకే ఇవ్వాలని జగన్‌ను వాణి అభ్యర్థించారు. దీంతో సీటు ఎవరికి కావాలో తేల్చుకోవాలని జగన్ వారికి సూచించారు. చివరికి వాణినే బరిలోకి దించాలని శ్రీనివాస్ కూడా నిర్ణయించడంతో వైసీపీ నిన్న ఆమె పేరును అధికారికంగా ప్రకటించింది.