Mahesh Babu: మహేశ్-త్రివిక్రమ్ సినిమా టైటిల్ ప్రకటనపై అప్ డేట్ ఇదిగో!

Update on Mahesh Babu SSMB28 title announcement
షార్ట్స్‌లో చూడండి
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న కొత్త చిత్రం టైటిల్ పై చిత్రబృందం నుంచి అప్ డేట్ వచ్చింది. ఈ సినిమా టైటిల్ ను మే 31న అనౌన్స్ చేస్తున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ వెల్లడించింది. మే 31న మహేశ్ సూపర్ ఫ్యాన్స్ థియేటర్లలో ఈ టైటిల్ విడుదల చేస్తారని పేర్కొంది. 

కాగా, ఇప్పటివరకు ఈ సినిమాకు ఎస్ఎస్ఎంబీ28 అనే వర్కింగ్ టైటిల్ కొనసాగించారు. ఇది మహేశ్ బాబుకు 28వ చిత్రం. ఇందులో మహేశ్ మాస్ లుక్ తో కనిపిస్తుండడంతో అభిమానుల అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రంలో మహేశ్ బాబు సరసన పూజా హెగ్డే, శ్రీలీల నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.
Go Back to Shorts
Mahesh Babu
SSMB28
Title
Update
Trivikram Srinivas
Tollywood

More Telugu News