Vadde Sobhanadreeswara Rao: దేశాన్ని అధ్యక్ష తరహా పాలనలోకి తీసుకెళ్లే ప్రయత్నాలుజరుగుతున్నాయి: వడ్డే శోభనాద్రీశ్వరరావు

Vadde Sobhanadreeswara Rao criticize Modi Govt
  • వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే పరిస్థితులు దారుణంగా ఉంటాయన్న మాజీ మంత్రి
  • దేశం రాచరిక పద్ధతిలోకి వెళ్లాలన్నది మోదీ ఆకాంక్షని విమర్శ
  • రాజదండం ప్రతిష్ఠాపనకు సన్నాహాలు అందుకేనని మండిపాటు
కేంద్రంలోని బీజేపీ పాలనపై మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లోనూ బీజేపీ విజయం సాధించి అధికారంలోకి వస్తే దేశంలో పరిస్థితులు దారుణంగా ఉంటాయని అన్నారు. 

దేశాన్ని అధ్యక్ష తరహా పాలనలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. దేశం రాచరిక పద్ధతిలోకి వెళ్లాలన్న మోదీ ఆకాంక్షకు రాజదండం ప్రతిష్ఠాపన నిదర్శనమని శోభనాద్రీశ్వరరావు మండిపడ్డారు. కాగా, బ్రిటిషర్ల నుంచి అధికార మార్పిడికి గుర్తుగా జవహర్‌లాల్ నెహ్రూకి లార్డ్ మౌంట్‌బాటన్ అందించిన రాజదండాన్ని ఈ నెల 28న ప్రధానమంత్రి మోదీ లోక్‌సభలో ప్రతిష్ఠించనున్నారు.
Vadde Sobhanadreeswara Rao
Andhra Pradesh
Narendra Modi
Sengol

More Telugu News