Uttar Pradesh: షూటింగ్ కోసం వచ్చి.. హోటల్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి దర్శకుడు

Bhojpuri director Subhash Chandra Tiwari found dead in hotel room
  • ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్రలో ఘటన
  • చిత్రబృందంతో కలిసి హోటల్‌లో బస
  • ఆయన శరీరంపై ఎలాంటి గాయాలు లేవన్న పోలీసులు
షూటింగ్ కోసం చిత్రబృందంతో కలిసి ఓ హోటల్‌లో బస చేసిన భోజ్‌పురి దర్శకుడు సుభాష్ చంద్ర తివారి శవమై కనిపించారు. ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్రలో జరిగిందీ ఘటన. సినిమా షూటింగ్ కోసం వచ్చిన ఆయన చిత్ర బృందంతో కలిసి హోటల్ తిరుపతిలో బస చేశారు. నిన్న ఆయన అక్కడే మృతి చెంది కనిపించినట్టు పోలీసులు తెలిపారు. ఆయన శరీరంపై ఎలాంటి గాయాలు లేవని పేర్కొన్నారు. దీంతో ఆయన ఎలా మరణించిందీ తెలుసుకునేందుకు మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపారు. నివేదిక వచ్చాక పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. సుభాష్ చంద్ర తివారీది మహారాష్ట్ర అని పోలీసులు తెలిపారు.

ఇటీవలి కాలంలో ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో మరణాలు ఎక్కువయ్యాయి. పాప్యులర్ టీవీ నటుడైన నితీశ్ పాండే రెండు రోజుల క్రితం గుండెపోటుతో ఓ హోటల్‌లో మృతి చెంది కనిపించారు. షూటింగ్ నిమిత్తం మహారాష్ట్రలోని ఇగత్‌పురిలో ఓ హోటల్‌లో బస చేసిన ఆయన చనిపోయారు. ఈ నెల 22న బుల్లితెర యువ నటుడు ఆదిత్య సింగ్ రాజ్‌పుత్ మరణించారు. ఆ తర్వాతి రోజే ‘సారాభాయ్ వర్సెస్ సారాభాయ్’ నటి వైభవి ఉపాధ్యాయ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
Uttar Pradesh
Kanpur
Bhojpuri Film Industry
Subhash Chandra Tiwari

More Telugu News