Ahimsa: హీరో ఉదయ్ కిరణ్ మరణంపై దర్శకుడు తేజ సంచలన కామెంట్స్

Director Teja sensational comments about Uday kiran death mystery during Ahimsa promotions
  • తన తాజా మూవీ ‘అహింస’ ప్రమోషన్స్‌లో తేజ సంచలన వ్యాఖ్య
  • ఉదయ్ కిరణ్ మరణంపై తొలుత తేజను ప్రశ్నించిన యాంకర్
  • అతడి డెత్ మిస్టరీ గురించి తెలిసినా కొందరు ఏమీ తెలియనట్టు నటిస్తున్నారన్న తేజ

హీరో ఉదయ్ కిరణ్ డెత్ మిస్టరీ గురించి తెలిసినా చాలా మంది ఏమీ తెలియనట్టు నటిస్తున్నారని దర్శకుడు తేజ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తాజా చిత్రం ‘అహింస’ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో తేజ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంటర్వ్యూ సందర్భంగా వ్యాఖ్యాత తొలుత ఉదయ్ కిరణ్ డెత్ మిస్టరీ గురించి తేజను ప్రశ్నించారు. దీనికి సమాధానమిస్తూ తేజ..‘‘దాని గురించి మాట్లాడతాను. అయితే, కొందరు ‘మీరే చెప్పండి’ అంటూ అమాయకంగా యాక్ట్ చేస్తుంటారు’’ అని షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఉదయ్ కిరణ్‌ను తేజ వెండితెరకు పరిచయం చేశారు. ఉదయ్ కిరణ్ మొదటి సినిమా ‘చిత్రం’ సూపర్ హిట్. ఆ తరువాత వీరి కాంబోలో వచ్చిన ‘నువ్వు నేను’, ‘ఔనన్నా కాదన్నా’ సినిమాలు కూడా ప్రేక్షకులను అలరించాయి. ఇక ‘అహింస’ సినిమాలో ప్రముఖ నిర్మాత డి.సురేశ్‌బాబు తనయుడు అభిరామ్ హీరోగా పరిచయం అవుతున్నాడు. ప్రేమ, యాక్షన్ ప్రధానాంశాలుగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో రజత్ బేడీ, గీతిక, సదా, రవికాలే, కమల్ కామరాజు, మనోజ్ టైగర్ తదితరులు నటించారు. ఆర్.పి. పట్నాయక్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా జూన్ 2న రిలీజ్ కానుంది.

  • Loading...

More Telugu News