Tirupati: పెంపుడు శునకానికి హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు

  • తిరుపతిలో చోటుచేసుకున్న ఘటన
  • శునకం మృతికి పలువురి సంతాపం
  • వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ పోలీసులకు యజమాని ఫిర్యాదు
Last Rites for dogs in Tirupati

పెంపుడు శునకం మృతిని జీర్ణించుకోలేకపోయిన ఓ కుటుంబం హిందూ సంప్రదాయం ప్రకారం అంతిమ సంస్కారాలు నిర్వహించి దానిపై తమకున్న అభిమానాన్ని చాటుకుంది. తిరుపతిలో జరిగిందీ ఘటన. పట్టణానికి చెందిన దాము కుటుంబం కొన్నేళ్లుగా ఓ శునకాన్ని పెంచుకుంటోంది. దానికి విక్కీ అని పేరు పెట్టి కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చూసుకుంటున్నారు.

ఇటీవల అది అనారోగ్యం బారినపడడంతో పశువైద్యశాలకు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ విక్కీ నిన్న మరణించింది. దీంతో హిందూ సంప్రదాయం ప్రకారం దానికి అంత్యక్రియలు నిర్వహించారు. విక్కీ మృతికి పలువురు సంతాపం తెలిపారు. అయితే, తన శునకం చనిపోవడానికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ పశువైద్య కౌన్సిల్, కలెక్టర్, పోలీసులకు దాము ఫిర్యాదు చేశారు.

More Telugu News