Chandrababu: వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలపై 408 క్రిమినల్ కేసులున్నాయి: చంద్రబాబు

Chandrababu criticizes YCP MLAs and MPs
  • వైసీపీ ప్రజాప్రతినిధులు నేరచరితులని చంద్రబాబు విమర్శలు
  • జగన్ పైనే 31 కేసులు పెండింగ్ లో ఉన్నాయని వ్యాఖ్య 
  • తెలిసింది గోరంత మాత్రమేనని, తెలియాల్సింది చాలా ఉందంటూ ట్వీట్
వైసీపీ ప్రజాప్రతినిధుల్లో చాలామంది నేరచరితులేనని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలపై మొత్తం 408 క్రిమినల్ కేసులున్నాయని వెల్లడించారు. జగన్ పైనే 11 సీబీఐ కేసులు, 9 ఈడీ కేసులు ఉన్నాయని, ఆయనపై మొత్తం 31 కేసులు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ న్యాయ కార్యకలాపాల ఖర్చులు 70 శాతం పెరిగాయని చంద్రబాబు పేర్కొన్నారు. తెలిసింది గోరంత మాత్రమేనని, తెలియాల్సింది చాలా ఉందని అన్నారు. ఇలాంటి నేరస్తులు ప్రజలకు న్యాయం చేస్తారా? అంటూ విమర్శించారు.
Chandrababu
TDP
Jagan
YSRCP
Andhra Pradesh

More Telugu News