Nidhi Pay: 110వ ర్యాంక్ వచ్చినా మళ్లీ సివిల్స్ రాస్తానంటున్న హైదరాబాద్ యువతి

Hyderabad woman Nidhi Pay gets 110th rank in Civils
  • సివిల్స్ ఫలితాలు విడుదల చేసిన యూపీఎస్సీ
  • మూడో ప్రయత్నంలో 110వ ర్యాంకు సాధించిన నిధి పాయ్
  • తన లక్ష్యం ఐఏఎస్ అని వెల్లడించిన నిధి
  • మరింత మెరుగైన ర్యాంక్ సాధిస్తానని ధీమా

ఇవాళ యూపీఎస్సీ సివిల్స్ ఫలితాలు వెల్లడయ్యాయి. హైదరాబాద్ కు చెందిన నిధి పాయ్ 110వ ర్యాంకు సాధించింది. ఆమెకు మూడో ప్రయత్నంలో ఈ ర్యాంకు వచ్చింది. ఈ నేపథ్యంలో, శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ నిధి పాయ్ కు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో నిధి పాయ్ ని మీడియా పలకరించింది. తన కుటుంబంలో సివిల్ సర్వీసెస్ వ్యక్తులు ఎవరూ లేరని, అయిన్పపటికీ ఈ ర్యాంకు సాధించడం సంతోషంగా అనిపిస్తోందని పేర్కొంది. 

అయితే, తన లక్ష్యం ఐఏఎస్ అని స్పష్టం చేసింది. అందుకే మరోసారి సివిల్స్ రాస్తానని, మరింత మెరుగైన ర్యాంక్ సాధిస్తానని నిధి పాయ్ ధీమాగా చెబుతోంది. తన విద్యాభ్యాసం వివరాలు చెబుతూ, అరోరా డిగ్రీ కాలేజి నుంచి బీకామ్ ఆనర్స్ చేశానని వెల్లడించింది. 

తమ తల్లిదండ్రుల స్వస్థలం కర్ణాటక అని, తమ కుటుంబం హైదరాబాద్ లో స్థిరపడిందని తెలిపింది. గత కొన్నాళ్లుగా పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నానని వివరించింది.

  • Loading...

More Telugu News