చంద్రబాబు ఆదేశాలతో ఎక్కడి నుంచి అయినా పోటీ చేస్తా: ఆనం రామనారాయణ రెడ్డి
- ఎంపీగా కాదు.. ఎమ్మెల్యేగానే పోటీ చేస్తానన్న ఆనం
- ఈ ఏడాది చివర్లో ముందస్తు ఎన్నికలు ఉంటాయని అంచనా
- ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి టీడీపీలోకి 60 శాతం మంది చేరతారని వ్యాఖ్య
రాష్ట్రంలో జరుగుతున్న ముందస్తు ఎన్నికల ప్రచారంపైనా ఆనం స్పందించారు. ఈ ఏడాది చివర్లో ముందస్తు ఎన్నికలు ఉంటాయని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఈ ఎన్నికల్లో జిల్లాలో అన్ని స్థానాలను టీడీపీ గెలుస్తుందని జోస్యం చెప్పారు. ఎన్నికలకు ముందు టీడీపీలోకి 60 శాతం మంది వైసీపీ నుంచి చేరతారని అన్నారు. ప్రస్తుతం వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి పనుల కోసం చాలా మంది ఆ పార్టీలోనే కొనసాగుతున్నారని తెలిపారు.