Atchannaidu: తిరుమల కొండపై వైసీపీ జెండాతో జీపు తిరుగుతుంటే విజిలెన్స్ సిబ్బంది ఏంచేస్తున్నారు?: అచ్చెన్నాయుడు

Atchannaidu questions a jeep in Tirumala campaigning with YCP flag
  • తిరుమల కొండపై రాజకీయ ప్రచారం చేస్తున్నారన్న అచ్చెన్న
  • పుణ్యక్షేత్రాన్ని రాజకీయ వేదికగా మార్చేశారని విమర్శలు
  • కొండపై విజిలెన్స్ సిబ్బంది ఉన్నారా, లేదా? అంటూ ఆగ్రహం
తిరుమల కొండపై ఓ జీపు వైసీపీ జెండాతో తిరుగుతోందని, ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలంటూ ప్రచారం సాగిస్తోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. జగన్ రెడ్డి అండ్ కో తిరుమల వంటి ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాన్ని రాజకీయ వేదికగా మార్చేశారంటూ మండిపడ్డారు. అసలు, తిరుమలలో విజిలెన్స్ సిబ్బంది ఉన్నారా? లేదా? అని ఆయన గట్టిగా ప్రశ్నించారు. కొండపై ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడుతుంటే విజిలెన్స్ సిబ్బంది ఏం చేస్తున్నారని అచ్చెన్నాయుడు నిలదీశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తిరుమలలో ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద విషయం జరుగుతూనే ఉందని విమర్శించారు.
Atchannaidu
Jeep
YCP Flag
Tirumala
TDP
Andhra Pradesh

More Telugu News