కన్నీళ్లు పెట్టిస్తోన్న‘జబర్దస్త్’ యాంకర్ వీడియో
- తల్లిని తల్చుకుంటూ వీడియో పోస్ట్ చేసిన సౌమ్యా రావు
- కేన్సర్ తో కన్నుమూసిన సౌమ్య తల్లి
- చివరి రోజుల్లో నరకం అనుభవించిందని కన్నీటి పర్యంతమైన యాంకర్
‘అమ్మ కోసం గుడికి వెళ్లి పూజలు చేశాను. ఉపవాసాలు ఉన్నాను. అయినా దేవుడు నా మీద దయ చూపలేదు. దేవుడు ఎందుకు ఇలా చేశాడు అని చాలా బాధపడుతున్నాను. అమ్మా.. ఆఖరి రోజుల్లో నువ్వు పడిన బాధలు మర్చిపోలేక పోతున్నా. నువ్వు లేకుండా నా జీవితం అసంపూర్ణంగానే మిగిలింది. ప్రతి క్షణం నిన్ను మిస్ అవుతున్నాను. అమ్మా, నా కోసం మళ్లీ పుడతావని వేయికళ్లతో ఎదురు చూస్తున్నా. దేవుడా! మళ్లీ మా అమ్మానాన్నలను నాకు ఇవ్వు. లవ్యూ సో…మచ్’ అంటూ సౌమ్య అమ్మపై తనకున్న ప్రేమను పోస్ట్ లో వివరించింది.