Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'బ్రో' సెట్స్ పైకి పవన్ ఎంట్రీ అదిరింది... వీడియో ఇదిగో!

Pawan Kalyan enters BRO sets
Advertisement
  • పవన్, సాయిధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో బ్రో
  • సముద్రఖని దర్శకత్వంలో చిత్రం
  • పవన్ రాకతో సెట్స్ పై ఉత్సాహభరిత వాతావరణం
Advertisement
పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రానికి ఇటీవల 'బ్రో' అనే టైటిల్ కన్ఫామ్ చేసిన సంగతి తెలిసిందే. టైటిల్ తో పాటే రిలీజైన మోషన్ పోస్టర్ కు రికార్డు స్థాయిలో స్పందన వచ్చింది. కాగా, బ్రో సెట్స్ పైకి పవన్ కల్యాణ్ నేడు అడుగుపెట్టారని చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వెల్లడించింది. పవన్ రాకతో సెట్స్ పై వాతావరణం ఉత్సాహభరితంగా మారిపోయిందని పేర్కొంది. 

ఓ లగ్జరీ వాహనంలో సెట్స్ వద్దకు వచ్చిన పవన్ కు దర్శకుడు సముద్రఖని ఆత్మీయ స్వాగతం పలికారు. లాల్చీ, పైజామా డ్రస్ లో ఉన్న పవన్ స్వయంగా వాహనాన్ని డ్రైవ్ చేసుకుంటూ వచ్చారు. 

బ్రో చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ఈ చిత్రం జులై 28న వరల్డ్ వైడ్ విడుదల కానుంది.
Advertisement
Advertisement
Pawan Kalyan
BRO
Sets
Sai Dharam Tej
Samuthirakani
People Media Factory

More Telugu News