Chennai Super Kings: ఢిల్లీ దర్బార్ కు కింగ్స్.. సీఎస్కే ఆసక్తికర పోస్ట్

Kings take to the Dilli Darbaar today tweets CSK
షార్ట్స్‌లో చూడండి
ఐపీఎల్ - 2023 తుది అంకానికి చేరుకుటోంది. లీగ్ దశ క్లైమాక్స్ కు చేరుకుంది. లీగ్ లో టాప్ లో నిలిచిన గుజరాత్ ఇప్పటికే ప్లేఆఫ్స్ కు అర్హత సాధించగా.. మిగతా మూడు స్థానాల కోసం 6 జట్లు పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఈ రోజు మధ్యాహ్నం తొలి మ్యాచ్ జరగనుంది. 

8 ఓటములతో ఢిల్లీ ఇప్పటికే రేసు నుంచి నిష్క్రమించగా, చెన్నై ఇంకా పోటీలో ఉంది. ఈ మ్యాచ్ ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉంది. ఇదే విషయాన్ని ట్విట్టర్ లో ఆసక్తికరంగా చెప్పుకొచ్చింది సీఎస్కే. ‘‘ఈ రోజు ఢిల్లీ దర్బార్ కు ‘కింగ్స్’ వెళ్తున్నారు’’ అంటూ ట్వీట్ చేసింది. ధోనీ, జడేజా, మొయిన్ అలీ తదితరులు గుర్రాలపై, వెనుకాల బ్యాట్లు తగిలించుకుని యుద్ధానికి వెళ్తున్నట్లుగా ఫోటోను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది. ‘ఎట్లాగైనా గెలవాల్సిందే’ అంటూ చెన్నై అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. 

పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న గుజరాత్.. ఇంకా ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే ప్లేఆఫ్స్ కు అర్హత సాధించింది. చెన్నై సూపర్ కింగ్స్ కు లీగ్ లో ఇదే చివరి మ్యాచ్. ఇందులో గెలిస్తే.. ప్లేఆఫ్స్ కు అర్హత సాధిస్తుంది. ఓడితే మాత్రం ఇతర జట్ల పాయింట్లు, రన్ రేట్ పై ఆధారపడాల్సి వస్తుంది. లక్నో టీమ్ ది కూడా ఇలాంటి పరిస్థితే. ఇక రాయల్ చాలెంజర్స్, ముంబయి ఇండియన్స్, కోలకతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు.. ఇతర జట్ల ఫలితాలపైనే ఆధారపడ్డాయి.
Go Back to Shorts
Chennai Super Kings
Delhi Capitals
MS Dhoni
CSK
DC
IPL 2023
David Warner

More Telugu News