RBI: ఇకపై రూ.2 వేల నోట్లు ఇవ్వొద్దు... బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశాలు

  • రూ.2 వేల నోట్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం
  • రూ.2 వేల నోట్లను చెలామణి నుంచి తప్పిస్తున్నట్టు సంకేతాలు
  • ఆర్బీఐ ఉత్తర్వులు తక్షణమే అమలు
RBI issues orders on Rs 2000 currency notes

దేశంలో పెద్ద నోట్ల వినియోగం నకిలీ నోట్ల వ్యాప్తికి దారితీస్తుందని ఎప్పటినుంచో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా, రూ.2 వేల నోట్లకు నకిలీలు తీసుకువస్తే దేశ ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం తప్పదని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. 

వినియోగదారులకు రూ.2 వేల నోట్లు ఇవ్దొద్దని బ్యాంకులను ఆదేశించింది. ఈ మేరకు తాజా ఉత్తర్వులు వెలువరించింది. ఆర్బీఐ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి రానున్నాయి. ఈ నిర్ణయం నేపథ్యంలో, ఆర్బీఐ రూ.2 వేల నోట్లను చెలామణి నుంచి తప్పించనున్నట్టు అర్థమవుతోంది. 

అయితే, ఇప్పటికే ఎవరి వద్ద అయినా రూ.2 వేల నోట్లు ఉంటే ఆ నోట్లను ఈ నెల 23వ తేదీ నుంచి మార్చుకునే అవకాశం ఇస్తున్నారు. 19 ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో రూ.2 వేల నోట్లను మార్చుకునే వెసులుబాటు కల్పించారు. రూ.2 వేల నోట్లను సెప్టెంబరు 30 లోగా మార్చుకోవాలని ఆర్బీఐ స్పష్టం చేసింది. 

2018-19 ఆర్థిక సంవత్సరంలోనే రూ.2 వేల నోట్ల ముద్రణను నిలిపివేసినట్టు ఆర్బీఐ వెల్లడించింది.

More Telugu News