Bro: రికార్డు స్థాయి వ్యూస్ తో దూసుకెళుతున్న పవన్ కల్యాణ్ 'బ్రో' మోషన్ పోస్టర్

మామాఅల్లుళ్లు పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో, సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'బ్రో'. నిన్ననే ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేయడంతో పాటు పవన్ లుక్ తో మోషన్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. కాగా, ఈ మోషన్ పోస్టర్ రికార్డులు కొల్లగొడుతోందని దర్శకుడు సముద్రఖని వెల్లడించారు. 

విడుదలైన 20 గంటల 20 నిమిషాల్లో 'బ్రో' మోషన్ పోస్టర్ 4.74 మిలియన్లకు పైగా వ్యూస్ నమోదు చేసిందని వివరించారు. టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలో అత్యధికులు వీక్షించిన మోషన్ పోస్టర్ ఇదేనని పేర్కొన్నారు. 'బ్రో' చిత్రంలో పవన్ భగవంతుడి పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ తో కలిసి టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.
Bro
Pawan Kalyan
Sai Dharam Tej
Motion Poster
Samuthirakani
Tollywood

More Telugu News