Uttar Pradesh: హనీమూన్ కోసం రూ. 10 లక్షలు డిమాండ్ చేసిన కొత్త పెళ్లికొడుకు.. రూ. 5 లక్షలు ఇవ్వడంతో భార్య అసభ్యకర ఫొటోలు తీసి బెదిరింపులు!

Groom demanded 10 lakh rupees in dowry for honeymoon
  • ఉత్తరప్రదేశ్‌లోని బదాయూలో ఘటన
  • ఈ ఏడాది ఫిబ్రవరిలో వివాహం
  • పెళ్లయిన వెంటనే భార్యను దూరం పెట్టిన భర్త
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య
కట్టుకున్న భార్యను హనీమూన్ తీసుకెళ్లేందుకు రూ. 10 లక్షలు డిమాండ్ చేశాడో కొత్త పెళ్లికొడుకు. అత్తింటివారు రూ. 5 లక్షలు మాత్రమే ఇవ్వడంతో భార్య అసభ్యకర ఫొటోలు తీసి బెదిరించడం మొదలుపెట్టాడు. ఉత్తరప్రదేశ్‌లో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. బదాయూకు చెందిన యువకుడు ఫిలిబిత్‌కు చెందిన యువతిని ఈ ఏడాది ఫిబ్రవరిలో వివాహం చేసుకున్నాడు. పెళ్లయిన తర్వాతి నుంచే భార్యను దూరం పెట్టడం మొదలుపెట్టాడు. తొలి రాత్రి కూడా జరగకపోవడంతో అమ్మాయి కుటుంబ సభ్యులు ప్రశ్నించారు. 

తనకు రూ. 10 లక్షలు ఇస్తేనే భార్యను హనీమూన్‌కు తీసుకెళ్తానని, లేదంటే లేదని తేల్చి చెప్పాడు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో వారు రూ. 5 లక్షలు ఇచ్చుకున్నారు. డబ్బు అందుకున్నాక ఈ నెల 7న భార్యను హనీమూన్ కోసం నైనిటాల్ తీసుకెళ్లాడు. అక్కడ భార్య అసభ్యకర ఫొటోలు, వీడియోలు తీసి బెదిరించడం మొదలుపెట్టాడు. మిగతా రూ. 5 లక్షలు ఇవ్వాలని, లేదంటే వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తానని హెచ్చరించాడు. భర్త ప్రవర్తనతో విసిగిపోయిన బాధితురాలు ఈ నెల 13న పుట్టింటికి చేరుకుని భర్త, అత్తంటివారిపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Uttar Pradesh
Groom
Bride
Honeymoon

More Telugu News