కర్ణాటక కాంగ్రెస్లో విభేదాలు.. ఉప ముఖ్యమంత్రి పదవిని డిమాండ్ చేస్తున్న పరమేశ్వర
- ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై ఉత్కంఠకు తెరపడిన తర్వాత కొత్త సమస్య
- ఉప ముఖ్యమంత్రి పదవి తమ వర్గానికి ఇవ్వాలని పరమేశ్వర డిమాండ్
- లేదంటే పార్టీ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిక
అధిష్ఠానం నిర్ణయంపై సీనియర్ నేత జి.పరమేశ్వర తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దళితులకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వకుంటే పార్టీ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. గతంలో కాంగ్రెస్ - జేడీఎస్ కూటమిలో పరమేశ్వర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎనిమిదేళ్లుగా రాష్ట్ర కాంగ్రెస్ కోసం పని చేస్తున్నారు. గతంలో కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పని చేశారు. డీప్యూటీ సీఎం పదవిని ఆయన కూడా కోరుకుంటున్నారు.