YS Jagan: అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీని వేగవంతం చేయండి: అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు

YS Jagan on Amaravathi house distribution
  • గృహ నిర్మాణ శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష
  • పట్టాల పంపిణీ తర్వాత వేగంగా ఇళ్ల నిర్మాణ పనులకు ఆదేశాలు   
  • ఇళ్లు లేని పేదలకు సాధ్యమైనంత త్వరగా ఇళ్లు కట్టించి ఇవ్వాలన్న జగన్
అమరావతి ప్రాంతంలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీని వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గురువారం ఆయన గృహ నిర్మాణ శాఖపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... సీఆర్డీఏ ప్రాంతంలో పేదలకు పట్టాల పంపిణీ చేసిన తర్వాత వేగంగా ఇళ్ల నిర్మాణ పనులు ముందుకు తీసుకు వెళ్లేలా కార్యాచరణ చేయాలన్నారు. ఇళ్లు లేని నిరుపేదలకు సాధ్యమైనంత త్వరగా కట్టించి ఇవ్వడంపై దృష్టి సారించాలన్నారు.
YS Jagan
Amaravati

More Telugu News