Pawan Kalyan: పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ సినిమా టైటిల్ ఇదే... 'బ్రో'

Pawan Kalyan and Sai Dharam Tej new movie title Bro announced
  • పవన్, సాయిధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో చిత్రం
  • టైటిల్ అనౌన్స్ చేసిన చిత్రబృందం
  • టైటిల్ తో పాటు మోషన్ పోస్టర్ విడుదల
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ ప్రధానపాత్రల్లో సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రానికి నేడు టైటిల్ ప్రకటించారు. ఎంతో ఆసక్తిని రేకెత్తించేలా ఈ సినిమాకు బ్రో అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ మేరకు చిత్రబృందం టైటిల్ ను రివీల్ చేయడంతో పాటు మోషన్ పోస్టర్ ను కూడా పంచుకుంది. ఈ మోషన్ పోస్టర్ లో పవన్ లుక్ తో పాటు, తమన్ సంగీతం హైలైట్ గా నిలిచింది.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. మామా అల్లుడు కలిసి నటిస్తున్న ఈ చిత్రంపై మెగా ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇది తమిళ హిట్ మూవీ వినోదాయ సిథంకు రీమేక్. దీన్ని తెలుగు నేటివిటీ, పవన్ క్రేజ్ కు తగ్గట్టుగా దర్శకుడు సముద్రఖని మార్పులు చేర్పులు చేశారు. ముఖ్యంగా, బ్రో చిత్రానికి పవన్ సన్నిహితుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే సమకూర్చడం విశేషం.
Pawan Kalyan
Sai Dharam Tej
Bro
New Movie
Samuthirakani
Title
Motion Poster
Tollywood

More Telugu News