26/11 ముంబై ఉగ్రదాడుల నిందితుడిని భారత్‌కు అప్పగించనున్న అమెరికా
- తహావుర్ రాణాను భారత్ అప్పగించాలని అమెరికా న్యాయస్థానం ఆదేశం
- ఇరు దేశాల మధ్య నిందితుల అప్పగింత ఒప్పందానికి అనుగుణంగా తీర్పు
- 26/11 దాడుల్లో ఉగ్రవాదులకు ఆర్థికసాయం చేసిన నేరంపై జైలు శిక్ష అనుభవిస్తున్న తహావుర్
2008 నాటి ఉగ్రమూకల దాడిలో దాదాపు 166 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న డేవిడ్ హెడ్లీకి తహావుర్ రాణా సన్నిహితుడు. ఉగ్రవాదులకు ఆర్థిక సాయం చేసిన నేరంపై షికాగో కోర్టు తహావుర్ రాణాకు 14 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఇక, దాడులకు ముందు తహావుర్ ముంబైలో చివరిసారిగా రెక్కీ నిర్వహించాడని డేవిడ్ హెడ్లీ వాంగ్మూలం ఇచ్చాడు.