USA: అమెరికాలో ఎన్నారై యువతి అనుమానాస్పద స్థితిలో మృతి

Indian orgin woman dies in mysterious circumstances
  • మే 12 నుంచి కనిపించకుండా పోయిన లహరి పతివాడ
  • తాజాగా ఓక్లహోమా రాష్ట్రంలో యువతి మృతదేహం లభ్యం
  • చివరిసారిగా డాలస్ ఎల్‌డొరాడో పార్క్‌వేలో యువతి కనిపించిన వైనం
అమెరికాలో ఇటీవల అదృశ్యమయిన ఎన్నారై యువతి లహరి పతివాడ(25) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఓక్లహోమా రాష్ట్రంలో ఆమె మృతదేహం లభ్యమైంది. టెక్సాస్‌లోని కాలిన్స్ కౌంటీలోని మెకిన్నే ప్రాంతానికి చెందిన లహరి చివరిసారిగా డాలస్ పరిసరాల్లో ఎల్‌డొరాడో పార్క్‌వే, హార్డిన్ బూలీవార్డ్ బ్లాక్ ప్రాంతాలల్లో తన టొయోటా కారు నడుపుతూ కనిపించారు. మే 12న ఆమె ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు, స్నేహితులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలోనే యువతి స్నేహితులు ఓక్లహోమాలో ఆమె ఫోన్ ఉన్నట్టు గుర్తించారు. 

లహరి ఓవర్‌ల్యాండ్ పార్క్ ప్రాంతీయ వైద్య కేంద్రంలో పనిచేసేవారు. బ్లూ వ్యాలీ వెస్ట్ పాఠశాలలో చదువు అనంతరం ఆమె కాన్సాస్ విశ్వవిద్యాలయంలో ఉన్న విద్య పూర్తి చేశారు.
USA

More Telugu News