Mallikarjun Kharge: కర్ణాటక ముఖ్యమంత్రి రేసులోకి మూడో వ్యక్తి.. ఖర్గే కోసం నిరసన గళం

Workers protest in demand for Dalit CM and pitch Kharge into the ring
  • పీసీసీ కార్యాలయం వెలుపల కాంగ్రెస్ శ్రేణుల నిరసన
  • కర్ణాటకలో ఎస్సీ కమ్యూనిటీ ఎక్కువగా ఉందని, ఖర్గేను సీఎం చేయాలని డిమాండ్
  • ఇప్పటికే డీకే, సిద్ధూ మధ్య పోటాపోటీ
కర్ణాటక ముఖ్యమంత్రి రేసులో ఉన్న సిద్ధరామయ్య, డీకే శివకుమార్ లలో ఎవరిని ఆ పదవి వరిస్తుందో ఇప్పటికీ వెల్లడి కాలేదు. అంతలోనే కాంగ్రెస్ లో మరో డిమాండ్ తెరపైకి వచ్చింది. దళిత ముఖ్యమంత్రి డిమాండ్‌తో పలువురు కార్యకర్తలు బుధవారం బెంగళూరులోని పీసీసీ కార్యాలయం వెలుపల నిరసన తెలిపారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను ముఖ్యమంత్రిగా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎస్సీ కమ్యూనిటీ జనాభా ఎక్కువగా ఉందని, ఖర్గే సీఎం కావాలని తాము కోరుకుంటున్నామని నిరసన వ్యక్తం చేస్తున్న వారు తెలిపారు.
Mallikarjun Kharge
Congress
Karnataka

More Telugu News