Varun Tej: వరుణ్ తేజ్ వివాహం ఖాయమైనట్టేనా?

varun tej and lavanya tripathi marriage is on the cards this year
  • సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వరుణ్ తేజ్ పెళ్లి అంశం
  • లావణ్య త్రిపాఠితో పెళ్లికి ఇరువైపులా అంగీకరించినట్టు వార్తలు
  • దీనిపై అధికారికంగా వెలువడని ప్రకటన
నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ వివాహం మరోసారి వైరల్ అవుతోంది. లావణ్య త్రిపాఠిని వరుణ్ తేజ్ వివాహం చేసుకోనున్నట్టు ఆ మధ్య వార్తలు కూడా వచ్చాయి. తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు అది నిజమేనని తెలుస్తోంది. వరుణ్ తేజ్, లావణ్య వివాహానికి ఇరు కుటుంబాలు ఆమోదం తెలిపినట్టు సమాచారం. కాకపోతే పెళ్లి ముహూర్తాన్ని వారు ఇంకా నిశ్చయం చేసుకోలేదన్నది వార్తల సారాంశం. 

నాగబాబు కుటుంబంలో జరిగే కార్యక్రమాలకు లావణ్య వస్తుంటుంది. నిహారిక వివాహం సందర్భంగా ఆమె సందడి చేయడం అభిమానులకు తెలుసు. అప్పుడే వారి మధ్య ఏదో ఉందన్న గుసగుసలు వినిపించాయి. వీరిద్దరూ ఓ ఇంటి వారు అవుతారంటూ అప్పటి నుంచే ప్రచారం మొదలైంది. దీన్ని వారు ఖండించలేదు కూడా. సాధారణంగా నాగబాబు మౌనంగా ఉండే రకం కాదు. అయినా, తన కుమారుడు వరుణ్ తేజ్ పెళ్లి విషయంలో వస్తున్న వార్తలకు ఆయన ఎప్పుడూ పుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేయలేదు. దీంతో మరోసారి వీరి పెళ్లిపై చర్చ మొదలైంది. త్వరలో నిశ్చితార్థం, కొంత విరామం తర్వాత పెళ్లి ఉంటుందని అంటున్నారు.
Varun Tej
lavanya tripathi
marriage
Viral

More Telugu News