Amitabh Bachchan: తన జుట్టునే ఫ్యాన్‌లా వాడేసిన వ్యక్తి.. వీడియో షేర్ చేసిన అమితాబ్ బచ్చన్

Amitabh Bachchan shares video of man using his hair like a fan
  • వేసవిలో సొంత ఫ్యాన్ ను తీసుకెళ్తున్నాడని కామెంట్
  • సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న బాలీవుడ్ దిగ్గజం
  • ఈ మధ్య ట్రాఫిక్ లో చిక్కుకొని బైకర్ సాయంతో షూటింగ్ లొకేషన్ కు వెళ్లిన అమితాబ్
బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. తనకు సంబంధించిన విషయాలతో పాటు ఇతర విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంటారు. తాజాగా ఆయన ఓ ఆసక్తికర వీడియోను పోస్ట్ చేశారు. రోడ్డు మీద నడుస్తున్న ఓ వ్యక్తి తన తల వెనుక భాగంలో పొడవాటి జుట్టును ఫ్యాన్ మాదిరిగా తిప్పుతున్న వీడియోను పంచుకున్నారు.

‘ఈ వేసవి వీడిలో గాలికోసం అతను తన సొంత ఫ్యాన్‌ను తీసుకువెళ్తున్నాడు’ అని క్యాప్షన్ ఇచ్చారు. ఖాకీ డ్రెస్సులో వేగంగా నడుచుకుంటూ వెళ్తున్న ఆ వ్యక్తి పోలీస్ ఉద్యోగిలా ఉన్నాడు. కాగా, ఈ మధ్యే ముంబై ట్రాఫిక్ లో చిక్కుకున్న అమితాబ్‌ బచ్చన్‌ ఓ బైకర్‌ను లిఫ్ట్‌ అడిగి షూటింగ్ లొకేషన్‌కు చేరుకున్నారు. కానీ, బైకర్, ఆయన హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి.
Amitabh Bachchan
Viral Videos
Bollywood

More Telugu News