minister: ఇలాంటి ఆవిష్కరణలతో యువత ముందుకు రావాలి: మంత్రి కేటీఆర్

minister KTR impressed with autonomous Tractor developed by the team at KITS
  • డ్రైవర్ రహిత స్వయం చోదక ట్రాక్టర్ ను అభివృద్ధి చేసిన వరంగల్ కిట్స్
  • పొలాన్ని దున్నుతున్న ట్రాక్టర్ 
  • వీడియోని షేర్ చేస్తూ యువతకు పిలుపునిచ్చిన మంత్రి కేటీఆర్
వరంగల్ కు చెందిన కాకతీయ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్సెస్ (కిట్స్) అభివృద్ధి చేసిన స్వయం చోదక ట్రాక్టర్.. మంత్రి కేటీఆర్ కు ఎంతగానో నచ్చింది. దీన్ని తన ట్విట్టర్ పేజీలో షేర్ చేస్తూ ఇలాంటి ఆవిష్కరణలతో యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ ట్రాక్టర్ కు డ్రైవర్ అవసరం లేదు. పొలంలోకి తీసుకెళ్లి స్టార్ట్ చేస్తే చాలు.. దానంతట అదే పొలం చుట్టూ తిరుగుతూ దున్నేస్తుంది. 

‘‘ వరంగల్ కిట్స్ బృందం అభివృద్ధి చేసిన ఈ డ్రైవర్ రహిత స్వయం చోదక ట్రాక్టర్ నన్ను ఎంతో మెప్పించింది. భవిష్యత్తులో సాగు ఇదే మాదిరిగా ఉంటుంది. సమాజంపై తమదైన ముద్ర వేయాలని కోరుకునే యువ ఆవిష్కర్తలు ఇలాంటి మరిన్ని ఆలోచనలు, ఉత్పత్తులతో ముందుకు రావాలి. ఆవిష్కరణ, రూపకల్పన, అమలు చేయడం అన్నీ సామాజిక మార్పు కోసమే’’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
minister
KTR
impressed
autonomous Tractor

More Telugu News