keerthi suresh: కీర్తి సురేశ్ ను మనువాడబోయేది అతడేనా?

actress keerthi suresh wedding rumors
  • ఓ వ్యక్తితో కీర్తి సురేశ్ కలసి ఉన్న ఫొటో వెలుగులోకి
  • అతడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన కీర్తి
  • దీంతో వీరి పెళ్లిపై గుప్పుమన్న వార్తలు
మహానటి సినిమాతో దక్షిణాదిన బాగా పాప్యులారిటీ సంపాదించిన నటి కీర్తి సురేశ్. ఇటీవల నానితో చేసిన దసరా సినిమా సైతం మంచి స్పందనే తెచ్చుకుంది. మహానటితో జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్న తర్వాత నుంచి కీర్తి కెరీర్ లో తెగ బిజీ అయిపోయింది. ఇటీవల ఆమె వివాహానికి సంబంధించి కొన్ని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. సామాజిక మాధ్యమాల్లో కీర్తి సురేశ్ పెళ్లి అంశం హాట్ టాపిక్ గా మారింది. 

కీర్తి సురేశ్ ఓ వ్యాపారిని పెళ్లి చేసుకోబోతుందన్నది ఈ వార్తల సమాచారం. ఓ వ్యక్తితో కీర్తి సురేశ్ కలసి ఉన్న ఫొటో ఒకటి బయటకు వచ్చింది. సదరు వ్యక్తి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్న ఫర్హాన్ బీన్ లియాఖత్ అని తెలుస్తోంది. లియాఖత్ కు కీర్తి సురేశ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసింది. ‘‘హ్యాపీ బర్త్ డే ఫర్హానీ.. ఈ ఏడాది నీకు మంచి ఫలితాలు ఇస్తుందని భావిస్తున్నాను’’ అంటూ ఇన్ స్టాగ్రామ్ లో విషెస్ చెప్పింది. దీంతో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. నిజానికి వీరిద్దరూ చిన్ననాటి స్నేహితులని తెలుస్తోంది. నటీ నటులు అసలు పెళ్లి పీటలు ఎక్కే వరకు, వారి వివాహాలకు సంబంధించి ఎప్పుడూ ఏదో ఒక వార్త ఇలా సంచలనం అవుతూనే ఉంటుంది. 
keerthi suresh
actress
rumors

More Telugu News