పోలీసుల అదుపులో భూమా అఖిలప్రియ.. ఆళ్లగడ్డ నుంచి నంద్యాలకు తరలింపు
- లోకేశ్‌కు స్వాగతం పలికేందుకు అఖిలప్రియ, సుబ్బారెడ్డి వర్గాల భారీ ఏర్పాట్లు
- ఇరు వర్గాల మధ్య గత కొంతకాలంగా వర్గపోరు
- అఖిలప్రియ వర్గీయుడి దాడితో సుబ్బారెడ్డి ముక్కు నుంచి రక్తం
అఖిలప్రియ, సుబ్బారెడ్డి వర్గాల మధ్య గత కొంతకాలంగా వర్గపోరు నెలకొంది. ఈ నేపథ్యంలో కొత్తపల్లి వద్ద ఇరు వర్గాల మధ్య ఘర్షణ మొదలైంది. ఆ తర్వాత అది మరింత ముదిరింది. అఖిలప్రియ మద్దతుదారుడు సుబ్బారెడ్డిపై దాడిచేయడంతో ఆయన ముక్కు నుంచి రక్తం కారింది. ఇది ఉద్రిక్తతకు కారణమైంది. తక్షణం స్పందించిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ కేసులోనే అఖిలప్రియను తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు.