ప్రధాని మోదీ చేతుల మీదుగా 28న నూతన పార్లమెంటు భవనం ప్రారంభం!
- రూ. 970 కోట్ల అంచనా వ్యయంతో 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నాలుగు అంతస్తుల్లో నిర్మాణం
- 1,224 మంది ఎంపీలు కూర్చునే వీలు
- భారత ప్రజాస్వామ్య వారసత్వానికి ప్రతీకగా రాజ్యాంగ మందిరం
సెంట్రల్ విస్టా పునర్నిర్మాణ ప్రాజెక్టులో భాగంగా 10 డిసెంబరు 2020లో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పార్లమెంటు కొత్త భవనానికి శంకుస్థాపన చేశారు. త్రిభుజాకారంలో ఉండే ఈ పార్లమెంటు భవనం పనులు 15 జనవరి 2021న ప్రారంభమయ్యాయి. నిజానికి గతేడాది ఆగస్టులోనే పనులు పూర్తికావాల్సి ఉండగా కరోనా కారణంగా 9 నెలలు ఆలస్యమైంది. ప్రస్తుతం నిర్మాణ పనులు పూర్తికాగా తుదిమెరుగులు దిద్దుతున్నారు. భవనంలోని మూడు ప్రధాన ద్వారాలకు జ్ఞాన, శక్తి, కర్మ అని పేర్లు పెట్టారు.