NTR: టీడీపీ మహానాడుకు చురుగ్గా ఏర్పాట్లు.. విందులో గోదావరి రుచులు!

Godavari Tastes in TDP Mahanadu
  • ఈ నెల 27, 28 తేదీల్లో రాజమహేంద్రవరంలో టీడీపీ మహానాడు
  • ప్రతినిధుల సభకు లక్షమంది, బహిరంగ సభకు 15 లక్షల మంది వస్తారని అంచనా
  • ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రసిద్ధి చెందిన వంటకాల వడ్డింపు
దివంగత ఎన్టీఆర్ భోజన ప్రియుడు కావడంతో ఆయన శతజయంతి ఉత్సవాల్లో గోదావరి రుచులు వడ్డించాలని టీడీపీ నిర్ణయించింది. ఈ నెల 27, 28 తేదీల్లో రెండు రోజులపాటు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మహానాడు నిర్వహణకు ఏర్పాట్లు జోరుగా జరుగుతున్నాయి. వేమగిరి వద్ద నిర్వహించనున్న మహానాడు స్థలాన్ని నిన్న టీడీపీ నేతలు పరిశీలించారు. సాయంత్రం ఓ కల్యాణ మండపంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.

పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ మంత్రులు దేవినేని ఉమ, నిమ్మకాయల చినరాజప్ప, మాజీ ఎమ్మెల్యేలు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, దాట్ల సుబ్బరాజు తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మహానాడు తొలి రోజు ప్రతినిధుల సమావేశానికి లక్షమంది, తర్వాతి రోజు బహిరంగ సభకు 15 లక్షల మంది వస్తారని అంచనా వేసినట్టు చెప్పారు. వీరందరికీ భోజన ఏర్పాట్లు చేస్తున్నామని, విందులో ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రసిద్ధి చెందిన అన్ని రకాల వంటకాలు వడ్డిస్తామన్నారు.
NTR
Centenary Celebrations
Rajamahendravaram
Andhra Pradesh

More Telugu News